TLC - SPEECH
మనం ఎట్లాంటి మనుషులం? మాట్లాడే మనుషులమా, రాసే మనుషులమా, చదివే మనుషులమా, ఆలోచించే మనుషులమా, పని చేశె మనుషులమా, పనిచేస్తున్నట్లు చెప్పుకొనే, చూపిచ్చుకొనే, గుర్తింపు పొందాలనుకొనే మనుషులమా? రోజువారి దైనందిన జీవితంలో మనం ఏ ఉద్దేశం కోసమైతే ఎక్కువ సమయం కేటాయిస్తామో ఆ రకానికి చెందిన మనుషులుగా చెప్పుకోవచ్చు. మానవ పరిణామ దశలో మనుషులు ఏ రకమైన వర్గంలో ఉన్నప్పుడు ఎక్కువ వేగంగా అభివృద్ధి చెందిండ్రో ఒక సారి ఆలోచన చేసుకోవాలి. ఈ అభివృద్ధి వ్యక్తిగత మరియు సామాజిక అభివృద్ధిగా ఉండాలి. మాట్లాడే మనుషులుగా మనిషి ఎంత కాలం ఉన్నడు? లిపి నేర్చిన తర్వాత అబివృద్ధి వేగం ఎలా పెరిగింది? లిపిని నేర్చుకోవడం వేరు, లిపిని రోజూ వాడడం వేరు. రోజూ ఏదో ఒకటి రాస్తున్నావంటే మనం తప్పనిసరిగా ఆలోచిస్తున్నామని, చదువుతున్నామని చెప్పుకోవచ్చు. ఒక వ్యవస్థను, నిర్మాణాన్ని అర్థం చేసుకుంటున్నాం. కొత్త దాన్ని సృష్టిస్తున్నాం.
మొదటి దశలో - వారం రోజులు - ఎదో ఒక దాని పై రెండు పేజీలు రాయాలి.
రెండో దశలో - వారం రోజులు - మన సొంత అనుభవాలను/సంఘటనలను రాయలి.
మూదో దశలో - వారం రోజులు - రెండో దశలోని అనుభవాలను సారంశం రూపంలో రాస్తుంటే దానినే ఇప్పుడు కథా రూపంలో అంటే, రచయిత మానసిక స్థితిని, చుట్టూ ఉన్న పరిసరాలను, సంభాషణలోని మాటలను, అట్లా ఒక పాత్ర(వ్యక్తి) మాట్లాడుతున్నప్పుడు మిగిలిన వ్యక్తుల(పాత్రల) ఫీలింగ్స్‌ను, రచయిత అభిప్రాయాలను... రాయాలి. ఇలా పలు రకాల కోణాలలో ఒక సంఘటనను మనం అభివ్యక్తీకరించవచ్చు.
నాల్గో దశలో - వారం రోజులు- మన సొంత అనుభవాన్నే సారంశంగా కాకుండా, కథా రూపంలో కాకుండా, నాటక రూపంలో అంటే కేవలం సంభాషణాత్మక రూపంలో రాయాలి. అంటే కేవలం మనుషులు మాట్లాడుకునేది మాత్రమే వస్తుంది. అది ఎక్కడ ఏమిటనే ఒక పరిచయ వ్యాక్యం మాత్రమే ఉంటుంది. అంటే దృశ్య రూపంలో చూడటం, వినటం మాత్రమే జరుగుతుంది. రచయిత సొంతంగా ఏమీ వ్యాఖ్యానించడు. వ్యక్తులు(పాత్రలు) కూడా వాళ్ళ మనసులోని భావాలను తెలుపలేరు. అయినప్పటికీ వాళ్ళ మాటల ద్వారా, చేష్టల ద్వారా ప్రేక్షకుడు గ్రహించే విధంగా రాయాలి. చూపించాలి.
అయిదో దశలో - మన సొంత అనుభవాలను కాకుండా సమాజంలో మనం చూసినవి, లేకపోతే పేపర్లు, టీవీలలో చూసిన సంఘటనలను ఆధారం చేసుకొని రాయాలి. ఇవి కూడా సారాంశ రూపంలోనూ, కఠా రూపంలోనూ, నాటక(సంభాషణాత్మక) రూపంలోనూ రాయాలి. అయితే ఇక్కడా వ్యక్తుల, ఊర్ల(ప్రదేశాల) యొక్క నిజమైన పేర్లు కాకాండా మన రచన కోసం పేర్లను మార్చుకోవాల్సి ఉంటుంది.
రాసుడు ఒక వ్యసనం. మత్తుమందు. దానికి మనం బానిసలం కావాలి. మొదట చేదుగానే ఉంటుంది. కాని, అలవాటయినంక దాని మజానే వేరు. చాలా కిక్‌ని ఇస్తుంది.