TLC - HOME
తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలుగు లిటరరీ క్లబ్‌ను ప్రారంభిస్తున్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాము. ఈ వేదిక ద్వారా విద్యార్థులలో లేఖన నైపుణ్యాలను, సృజనాత్మక, అభివ్యక్తి నైపుణ్యాలను పెంపొందించడంలో శిక్షణ ఇవ్వబడుతుంది. సాహిత్య, సామాజిక అంశాల మీద, సైన్స్ ఫిక్షన్ కథలు, అంశాల మీద చర్చలు జరుగుతాయి. విద్యార్థుల చేత పుస్తక సమీక్షలు, సాహితీ(కథ, కవిత్వం ... ) వ్యాసంగాల ప్రజంటేషన్స్ మొదలగునవి ఇవ్వబడుతాయి. సాహిత్యంలో, కళలలో పేరుపొందిన ప్రతిభావంతుల పరిచయ కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. కావున ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి లేఖన, అభివ్యక్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోగలరు.
సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగాలలోని విద్యార్థులకు సాహిత్యం/లిటరేచర్ యొక్క ఆవశ్యకతను తెలపడం, తద్వారా వారిలోని ఊహాశక్తిని, సృజనాత్మక శక్తిని మేల్కొలిపి తద్వారా వారి సొంత సైన్స్ మరియు ఇంజనీరింగ్ అంశాలను అధ్యయనం చేసేటప్పుడు, ఈ నైపుణ్యాల ఆవసరాన్ని విశదీకరించి లోతైన అవగాహనకు పునాదులు వేయడం జరుగుతుంది. ఆధునిక విద్య కంటికి కనిపించే అంశాల మీదనే కాకుండా కంటికి కనిపించని అనేక అంశాల మీద అధ్యయనం చేస్తుంది. అట్లా కంటికి కనిపించని దాన్ని కూడా ఒక క్రమ మైన పద్ధతిలో చెప్తూ మన ఊహా శక్తి ద్వారా సాక్షాత్కరింప చేస్తుంది. అంటే ఊహాశక్తికి, రీజనింగ్ / లాజిక్‌కి ఉన్న సంబంధం ఏమిటో మనకు అవగతమవుతుంది. ఈ ఊహా శక్తికి సృజనాత్మకత తోడైతే కొత్త వస్తువులను, అంశాలను(కోర్సులను) ఆవిశ్కరించవచ్చు.
ఈ వేదిక ఆగష్టు 20 వ తారీఖు, సాయంత్రం 5.00 గంటలకు హ్యుమానిటీస్ బిల్డింగ్‌లో ప్రారంభమయింది. అప్పటి నుంచి ప్రతీ ఆదీవారం సాయంత్రం 5.00 గంటలకు నిర్వహించబడుతుంది. విద్యార్థులు నేరుగా హ్యుమానిటీస్ బిల్డింగ్‌కు వచ్చి పాల్గొనవచ్చు.
contact mail Id: technosAhiti@rgukt.ac.in